BREAKING
thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ thumb ● మునగపాకలో పెన్షన్ల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ thumb ● మునగపాకలో పెన్షన్ల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు
Date of Publish : 02 October 2026, 12:20 pm
Posted by : SEETHA KIRAN KUMAR

పరకాలలో తల్లీకుమార్తెపై కత్తితో దాడి.. కుమార్తె మృతి

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
02 Oct, 2026 - 12:20 PM
11 వీక్షణలు

పరకాల: పట్టణంలోని ఆకులవాడలో తల్లీకుమార్తెపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో కుమార్తె సుగుణమ్మ (63) మృతి చెందగా, తల్లి లచ్చమ్మ తీవ్రంగా గాయపడ్డారు.

గురువారం ఉదయం ఇంటి తలుపులు తెరవకపోవడంతో లచ్చమ్మ కుమారుడు వీరస్వామి ఇంటికి వెళ్లి చూడగా తల్లీకుమార్తె గాయాలతో కనిపించారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా, సుగుణమ్మ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన లచ్చమ్మను మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏసీపీ సతీశ్‌బాబు, సీఐ ప్రవీణ్‌కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

దాడికి కారణం ఏమిటి? ఘటనకు పాల్పడిన వ్యక్తులు ఎవరు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.