BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 October 2026, 09:34 pm
Posted by : MOOLA RAJENDRA REDDY

సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
08 Oct, 2026 - 09:34 PM
19 వీక్షణలు

జానంపాలెం, అక్టోబర్ 8: జానంపాలెం పరిధిలోని బొగ్గంచెలక, సిరిపుల్ల ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించినట్లు సమాచారం. దీంతో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

సిరిపుల్ల పరిసర ప్రాంతాల్లో పశువులను మేపేందుకు వెళ్లేవారు, జీవాలను కోసేందుకు వెళ్లేవారు, పొలాల్లో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఒంటరిగా అడవి, పొలాల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

పెద్దపులి సంచారం కనిపించినట్లయితే దాని దగ్గరకు వెళ్లడం, వెంబడించడం లేదా దానిని తరిమేందుకు ప్రయత్నించడం చేయకూడదని సూచిస్తున్నారు. పులి కనిపించిన వెంటనే స్థానిక అధికారులు, అటవీశాఖ సిబ్బంది, గ్రామ పెద్దలకు సమాచారం అందించాలని కోరుతున్నారు.

ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు వెంటనే స్పందించి పులి సంచారంపై నిర్ధారణ చేసి, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.