BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 27 September 2026, 07:46 am
Posted by : BOYA SWAMY

నల్లగొండలో అర్ధరాత్రి కలకలం.. అపార్ట్‌మెంట్‌లో కూలీ మృతి

తెలంగాణ
/ నల్గొండ / నల్గొండ
Reporter
Boya Swamy Chityala Mandal
27 Sep, 2026 - 07:46 AM
35 వీక్షణలు

నల్లగొండ, Ntoday News, సెప్టెంబర్ 27: నల్లగొండ పట్టణంలోని మీర్బాగ్ కాలనీ రోడ్ నంబర్ 6లోని షా రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో అర్ధరాత్రి సమయంలో దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులోని 402వ గదిలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం.


స్థానికుల సమాచారం ప్రకారం.. తమిళనాడుకు చెందిన కొంతమంది కూలీలు నల్లగొండలో నూతనంగా నిర్మిస్తున్న ఓ షాపింగ్ మాల్ నిర్మాణ పనుల కోసం వచ్చినట్లు తెలుస్తోంది. కూలీ డబ్బుల విషయంలో వారిమధ్య వివాదం తలెత్తి, అది ఘర్షణకు దారితీసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఘర్షణకు అసలు కారణం, మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.


ఘటనా స్థలాన్ని డీఎస్పీ శివరామరెడ్డి పరిశీలించినట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్సై సైదాబాబు ఆధ్వర్యంలో క్లూస్ టీమ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది.

మృతుడి వివరాలు, ఘటనకు దారితీసిన కారణాలు, ఇందులో ఎంతమంది ప్రమేయం ఉందనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.