BREAKING
thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి
Date of Publish : 07 October 2026, 06:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఖమ్మంలో శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి అంకురార్పణ

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Oct, 2026 - 06:37 PM
2 వీక్షణలు

ఈ నెల 12న భూమిపూజ.. చిన్న జీయర్ స్వామిని ఆహ్వానించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు 

ఖమ్మం నగర ఆధ్యాత్మిక చరిత్రలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఖమ్మంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి ఈ నెల 12న అంకురార్పణ జరగనుంది.

ఆలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి హాజరై ఆశీస్సులు అందించాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామిని స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ పాల్గొన్నారు.

ఖమ్మం గడ్డపై కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ జరగడం భక్తుల చిరకాల వాంఛను నెరవేర్చే ఘట్టమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని నగర ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.