BREAKING
thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు
మంచి మాట
Date of Publish : 27 October 2026, 09:28 pm
Posted by : KOLA MAHESH

సీఎం రేవంత్‌కు అండగా ఉందాం.. జిల్లా అభివృద్ధికి ఐక్యంగా కృషి చేద్దాం

తెలంగాణ
/ మహబూబాబాద్ / దోర్నకల్
Reporter
Kola Mahesh Munugodu Constituency
27 Oct, 2026 - 09:28 PM
12 వీక్షణలు

మహబూబాబాద్‌, అక్టోబర్‌ 27 | ఎన్‌ టుడే న్యూస్‌:

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అందరం అండగా నిలవాలని, మహబూబాబాద్‌ జిల్లా సమగ్ర అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాను విద్యాహబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో విద్య, సంక్షేమ మౌలిక వసతుల కల్పన సంస్థ ఆధ్వర్యంలో చేపట్టనున్న తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ నిర్మాణానికి ఎంపీ వేం నరేందర్‌ రెడ్డి, ఎంపీ పోరిక బలరాం నాయక్‌, ప్రభుత్వ విప్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రామచంద్ర నాయక్‌, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ భూక్యా మురళి నాయక్‌, జిల్లా కలెక్టర్‌ స్నేహ శబరీష్‌తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం నిర్వహించిన సభలో వేం నరేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా విద్యా సదుపాయాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు.

మండల కేంద్రంలోని సుమారు 600 ఏళ్ల చరిత్ర కలిగిన రంగనాయక స్వామి ఆలయ అభివృద్ధికి రూ.కోటి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని వేం నరేందర్‌ రెడ్డి తెలిపారు. ఫోర్‌లేన్‌ రోడ్డు నిర్మాణం, సెంట్రల్‌ లైటింగ్‌, నూతన విశ్రాంతి భవనం నిర్మాణం వంటి పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అన్ని సౌకర్యాలతో ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. బస్టాండ్‌ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించేలా చూడాలని కలెక్టర్‌ను కోరారు. అలాగే 30 పడకల ఆసుపత్రి, డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడి భూగర్భ జలాలు తగ్గే ప్రమాదం ఉందని వేం నరేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. రైతులు యాసంగి వరి సాగు విషయంలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సాగు చేసి నష్టపోవద్దని కోరారు.

గ్రామాల్లో తాగునీటి కొరత తలెత్తకుండా స్థానిక సర్పంచులు వ్యవసాయ బావులను అద్దెకు తీసుకుని సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు.

మహబూబాబాద్‌ జిల్లాను విద్యాహబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వేం నరేందర్‌ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అండగా నిలిచి జిల్లా అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ పులి వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వెన్నం శ్రీకాంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్‌ ఉమా మురళి నాయక్‌, మాజీ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌ చంద్రారెడ్డి, మహబూబాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జ్యోతి, రమేష్‌ నాయక్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఎదల్ల యాదవ రెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్‌, జిల్లా నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.