అడిగిన వెంటనే ఎల్ఓసీ.. నిలిచిన ప్రాణం
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన తుంగ రాజశేఖర్ లారీ, ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అనుకోకుండా తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన ఆయనకు అత్యవసర వైద్యం అవసరమైంది. అయితే వైద్య ఖర్చులు భరించే ఆర్థిక స్థోమత లేక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో రాజశేఖర్ కుటుంబ సభ్యులు చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి పరిస్థితిని వివరించి వైద్య సహాయం అందించాలని కోరారు.
వారి విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రూ.4 లక్షల విలువైన ఎల్ఓసీని మంజూరు చేసి అందించారు. ఎల్ఓసీ అందిన అనంతరం విజయవాడలోని ఆసుపత్రిలో వైద్యులు రాజశేఖర్‌కు హార్ట్ పేస్‌మేకర్ చికిత్స నిర్వహించారు. చికిత్స విజయవంతం కావడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడి ఆరోగ్యంగా కోలుకున్నారు.
చికిత్స అనంతరం క్యాంపు కార్యాలయానికి వచ్చిన రాజశేఖర్ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
“అడిగిన వెంటనే స్పందించి ఎల్ఓసీ అందించి నా ప్రాణాలను కాపాడారు. ఈరోజు నేను మీ ముందు ఆరోగ్యంగా నిలబడి మాట్లాడుతున్నానంటే మీ సహాయమే కారణం. నా కుటుంబ సభ్యులందరం మీకు జీవితాంతం రుణపడి ఉంటాం” అంటూ రాజశేఖర్ భావోద్వేగానికి గురయ్యారు.
ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి, ఆర్థిక ఇబ్బందులతో వైద్యం అందక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వ వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.