BREAKING
thumb ● సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి thumb ● బానోతు రామన్న నాయక్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి thumb ● జాతీయ రహదారి పనుల్లో స్థానిక అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి thumb ● మరిపెడ పట్టణ ప్రజలకు దీపావళి కానుక.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన.. శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి thumb ● బీజేపీలో చేరిన దామెర గ్రామ నాయకులు thumb ● వర్షపు నీరు వృథా కాకుండా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి thumb ● ఐదేళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకున్న నిందితుడి అరెస్ట్ thumb ● గో-కార్ట్ రేసింగ్‌లో నర్సంపేట డఫోడిల్స్ విద్యార్థి ప్రతిభ thumb ● సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి thumb ● బానోతు రామన్న నాయక్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి thumb ● జాతీయ రహదారి పనుల్లో స్థానిక అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి thumb ● మరిపెడ పట్టణ ప్రజలకు దీపావళి కానుక.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన.. శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి thumb ● బీజేపీలో చేరిన దామెర గ్రామ నాయకులు thumb ● వర్షపు నీరు వృథా కాకుండా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి thumb ● ఐదేళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకున్న నిందితుడి అరెస్ట్ thumb ● గో-కార్ట్ రేసింగ్‌లో నర్సంపేట డఫోడిల్స్ విద్యార్థి ప్రతిభ
Test 4
Date of Publish : 06 November 2026, 07:39 pm
Posted by : K MAHESH

మహబూబాబాద్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 07:39 PM
7 వీక్షణలు

పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారథి

కురవి, నవంబర్ 6 (ఎన్ టుడే న్యూస్): సరైన వర్షపాతం లేక పంటలు సాగు చేసినప్పటికీ ఆశించిన దిగుబడులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహబూబాబాద్ జిల్లా రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారథి డిమాండ్ చేశారు. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి, పంటలు సాగు చేయలేకపోయిన, పంటలు వేసి దిగుబడి పొందలేని రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

శుక్రవారం కురవి మండలంలోని పలు గ్రామాల్లో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నల్లు సుధాకర్ రెడ్డితో కలిసి విజయసారథి పర్యటించారు. ఆయా గ్రామాల్లో రైతులను కలిసి వర్షపాతం పరిస్థితులు, సాగు చేసిన పంటలు, దిగుబడులు, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సాధారణంగా కురవాల్సిన వర్షపాతంతో పోలిస్తే ఈసారి సుమారు 30 శాతం లోటు నమోదైందని తెలిపారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో చెరువుల్లోకి తగినంత నీరు చేరలేదని, దీంతో పలు ప్రాంతాల్లో భూములు బీడుగా మారాయని వివరించారు.

జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బావుల ఆధారంగా వరి సాగు చేస్తున్నప్పటికీ, మొత్తంగా ఆశించిన స్థాయిలో పంట దిగుబడులు రాలేదని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సాధారణంగా సుమారు 900 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, ఈసారి అందులో సగం కూడా కురవలేదని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మహబూబాబాద్ జిల్లాలోని అన్ని మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా గుర్తించి రైతులకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

కరువు పరిస్థితులను కేవలం కార్యాలయాల్లో కూర్చొని గణాంకాల ఆధారంగా అంచనా వేయడం సరిపోదని విజయసారథి అన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. ఏయే ప్రాంతాల్లో పంటలు సాగయ్యాయి, ఎక్కడ సాగు సాధ్యం కాలేదు, ఎక్కడ పంటలు దెబ్బతిన్నాయి, రైతులకు ఎంత మేర నష్టం వాటిల్లిందనే అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాతే కరువు పరిస్థితులపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా నష్టపోయిన రైతులందరికీ న్యాయం జరిగేలా పరిహారం అందించాలని పేర్కొన్నారు.

రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ప్రత్యేక నిధులతో పశుగ్రాసాన్ని కొనుగోలు చేసి రైతులకు అందించాలని కోరారు. ఆరుతడి పంటలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు ప్రకటించాలని, తద్వారా నీటి వనరులపై ఆధారపడకుండా మెట్ట పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదేవిధంగా కోతుల బెడద నుంచి పంటలను రక్షించుకునేందుకు రైతులకు వలలు అందించాలని కోరారు. పంటలను మార్కెట్‌కు తీసుకొచ్చినప్పుడు వ్యాపారులు అనవసరమైన కొర్రీలు పెట్టకుండా నేరుగా కొనుగోలు చేయాలని అన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు సరైన ధర లభించేలా మార్కెట్ వ్యవస్థలో తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వారికి ఆర్థిక భరోసా కల్పించినప్పుడే వ్యవసాయ రంగం నిలదొక్కుకుంటుందని పేర్కొన్నారు.

ఈ పర్యటనలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నెల్లూరు నాగేశ్వరరావు, టౌన్ కార్యదర్శి తురక రమేష్, మండల కన్వీనర్ బుడమ వెంకన్న, బుర్ర సమ్మయ్య, రవీందర్ నాయక్, రమేష్, రవి, వెంకటనారాయణ, పలువురు రైతులు పాల్గొన్నారు.