నార్కట్‌పల్లిలో అదనపు కలెక్టర్ వాహనానికి తప్పిన పెను ప్రమాదం
తెలంగాణ
/
నల్గొండ
/
నార్కెట్ పల్లి
NTODAY NEWS : నార్కట్‌పల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ ధారా వేణుగోపాల్ ప్రయాణిస్తున్న అధికారిక వాహనం సోమవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్తుండగా నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి కామినేని ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి–65పై వెళ్తున్న కంటైనర్ వాహనం నిర్లక్ష్యంగా మలుపు తిప్పడంతో అదనపు కలెక్టర్ వాహనం వెనుక భాగాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో అధికారిక వాహనం వెనుక భాగం దెబ్బతింది. అయితే అదనపు కలెక్టర్ ధారా వేణుగోపాల్‌తో పాటు వాహనంలో ఉన్న ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాద సమాచారం అందుకున్న నార్కట్‌పల్లి ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు.