BREAKING
thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు
Test 4
Date of Publish : 12 November 2026, 05:03 pm
Posted by : PAGADALA DEVAIAH

అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
12 Nov, 2026 - 05:03 PM
14 వీక్షణలు

నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో మహాసభలు.. కార్మిక–కర్షక ఐక్యతను బలోపేతం చేయాలని సీఐటీయూ నాయకుల పిలుపు

ఎల్బీనగర్, నవంబర్ 12: అఖిల భారత రైతు సంఘం (AIKS) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ ఎల్బీనగర్ సర్కిల్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు నల్లగొండలో నిర్వహించనున్న జాతీయ మహాసభలకు కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరింది. ఈ సందర్భంగా గురువారం ఎల్బీనగర్ చౌరస్తాలో మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పొట్టేపాక రామస్వామి మాట్లాడుతూ.. నవంబర్ 15న నల్లగొండలోని ఎన్‌జీ కాలేజీ మైదానంలో మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా అఖిల భారత రైతు సంఘం, తెలంగాణలో తెలంగాణ రైతు సంఘం రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు ఐక్య ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగిన అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభలకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలకు నాయకత్వం వహించిన చారిత్రక ఉద్యమాల గడ్డ నల్లగొండ వేదిక కావడం ప్రాధాన్యత సంతరించుకుందని నాయకులు పేర్కొన్నారు. నవంబర్ 15న మహాసభల ప్రారంభం సందర్భంగా సుమారు 15 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ మహాసభల్లో కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు భాగస్వాములు కావాలని, కార్మిక–కర్షక ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ ఉమ్మడి పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రైతాంగం, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరాన్ని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ అడ్డా అధ్యక్షుడు మున్నా, కార్యదర్శి లాట్ల లక్ష్మణ్, జోసెఫ్, లింగయ్య, బాలరాజు, కృష్ణయ్య, యాదగిరి, ఆలేటి లచ్చయ్య, కే. అంజయ్య, చిట్టెమ్మ, ఉప్పలమ్మ, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు.