BREAKING
thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి
Test 4
Date of Publish : 24 November 2026, 01:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిత్తపూరు 7వ వార్డులో లిబరేషన్ పార్టీ అభ్యర్థి వెంకటేశ్వరరావుపై దుష్ప్రచారం.. ఖండన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Nov, 2026 - 01:48 PM
7 వీక్షణలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామపంచాయతీలోని 7వ వార్డు నుంచి సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కలపాల వెంకటేశ్వరరావుపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు చాట్ల బాబురావు తెలిపారు.

సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు చాట్రాయి మండల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఆయన ఫొటోకు గుర్తులు పెట్టి, మార్ఫింగ్ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 7వ వార్డులో పోటీ చేస్తున్నట్లు కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.

తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోనని, గెలిచినా ఓడినా ఎర్రజెండా పార్టీ సీపీఐ ఎంఎల్ లిబరేషన్ అభ్యర్థిగానే ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు. తాము పోటీ చేస్తున్న స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదని చెప్పిన విషయాన్ని వక్రీకరించి, తాను ఆ పార్టీలో కలిసిపోయినట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు.

కొందరు వ్యక్తులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, వాస్తవాలను గుర్తించాలని వెంకటేశ్వరరావు పత్రికా ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.