కుటుంబ సభ్యుల కళ్లముందే వ్యక్తి ఉరేసుకొని మృతిచెందిన ఘటన
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
వరంగల్ జిల్లా, పర్వతగిరి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పర్వతగిరి మండలం ముంజాలకుంట తండా పరిధిలోని నరెంగతండాలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. నరెంగతండాకు చెందిన బానోత్ జవహార్‌లాల్‌కు భార్యతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనై ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. తొలుత ఆయన బెదిరింపుగా చేస్తున్నారని భావించడంతో కుటుంబ సభ్యులు స్పందించలేకపోయారని, అనంతరం పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు పోలీసుల కథనం.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను మరో వ్యక్తి వీడియో తీసినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.