దేవీ నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే అమరనాథరెడ్డికి ఆహ్వానం
పుంగనూరు: అన్నమయ్య జిల్లా పుంగనూరు మండల కేంద్రంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న దేవీ నవరాత్రి మహోత్సవాలకు హాజరుకావాలని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డిని పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శనివారం పలమనేరులో కలిసి ఆహ్వానించారు.
ఏటా ఘనంగా నిర్వహించే దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని నాయకులు కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఉత్సవాలకు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొంటానని తెలిపినట్లు నాయకులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పుంగనూరు పీవోసీ ఇన్‌చార్జి చిన్నా రాయల్, ఎన్‌వీఆర్ ట్రస్ట్ అధినేత వేణుగోపాల్ రెడ్డి, శంకర్ రెడ్డి, రమణారెడ్డి, రోహిత్, నాగరాజు రెడ్డితో పాటు పలమనేరు జనసేన నాయకులు పూల చైతన్య, నాగరాజు, మురాదు తదితరులు పాల్గొన్నారు.