BREAKING
thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
Date of Publish : 21 September 2026, 08:48 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

విద్యార్థులతో కలిసి జన్మదిన వేడుకలు. నిర్వహించిన ఎమ్మెల్యే .

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
21 Sep, 2026 - 08:48 PM
14 వీక్షణలు

విద్యార్థులతో కలిసి జన్మదిన వేడుకలు.. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల: తన జన్మదినం సందర్భంగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, వారితో ఆత్మీయంగా మాట్లాడారు. విద్యార్థుల విద్య, ఆరోగ్యం, పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

తన జన్మదినాన్ని విద్యార్థుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులతో కలిసి గడిపిన ఈ రోజు తన జీవితంలో మరువలేని రోజుగా నిలిచిపోతుందని అన్నారు.

పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీసీపీ భాస్కర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత, కార్పొరేటర్లు, ఉపాధ్యాయులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.