BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 05:00 pm
Posted by : PAGADALA DEVAIAH

చంపాపేట్ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కొరతపై ఎమ్మెల్యే అసంతృప్తి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
27 Nov, 2026 - 05:00 PM
30 వీక్షణలు

చంపాపేట్ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కొరతపై ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అసంతృప్తి

ఎల్బీనగర్, నవంబర్ 27: చంపాపేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శుక్రవారం పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, మరుగుదొడ్ల పరిస్థితి, విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణ పనుల పరిస్థితిపై ఎమ్మెల్యే ఆరా తీశారు. దాదాపు ఏడాది క్రితం రూ.17 లక్షల వ్యయంతో జీ+2 మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ, ఇప్పటివరకు వాటికి అవసరమైన కుండీలు ఏర్పాటు చేయకపోవడం, నీటి సౌకర్యం కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో వినియోగానికి అందుబాటులోకి రాకపోవడానికి గల కారణాలను ప్రశ్నించారు.

ఈ విషయంపై సంబంధిత కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)తో ఫోన్‌లో మాట్లాడి పాఠశాలలో నెలకొన్న సమస్యలను వివరించారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరుగుదొడ్ల సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. సమస్యను త్వరలో పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.

అనంతరం పాఠశాల విద్యార్థులతో ఎమ్మెల్యే మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ పాఠశాలలో సుమారు 700 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, వారి అవసరాలకు అనుగుణంగా కేవలం 8 నుంచి 9 మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు వివరించినట్లు తెలిపారు. అలాగే పాఠశాలలో పనిచేస్తున్న 32 మంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి కూడా తగిన మరుగుదొడ్ల సౌకర్యం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం అత్యంత ప్రాధాన్యమైన అంశమని పేర్కొన్నారు. పాఠశాలల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదని అన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లో వారి అవసరాలకు సరిపడా వసతులు ఉండేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో వసతులపై ప్రశ్నలు

ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య వంటి లక్ష్యాలను ప్రకటిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల పరిస్థితి ఎలా ఉందనే ప్రశ్నను ఎమ్మెల్యే లేవనెత్తారు. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, డిజిటల్ విద్యా సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

విద్యా రంగంలో నాణ్యతను పెంపొందించాలంటే ముందుగా పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు. చంపాపేట్ పాఠశాలలో గుర్తించిన సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించి, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.

ఈ తనిఖీలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముడుపు రాజిరెడ్డి, రవి ముదిరాజ్, గండికోట శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

NTODAY NEWS | ప్రతి క్షణం ప్రజల పక్షం