విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల: తన జన్మదినం సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల బాయ్స్ హైస్కూల్‌లో విద్యార్థులకు సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా అందిస్తున్న అల్పాహారాన్ని ఆయన విద్యార్థులతో కలిసి స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులతో కలిసి అల్పాహారం చేయడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల మధ్య జన్మదినాన్ని జరుపుకోవడం ప్రత్యేక అనుభూతిగా ఉందని తెలిపారు.
విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులతో కలిసి గడిపిన ఈ సందర్భం తన జీవితంలో మరువలేని రోజుగా నిలిచిందన్నారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, ఇతర కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.