BREAKING
టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్ జనార్ధనవరం లో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై కొత్త టోల్ పేమెంట్ ప్రారంభం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్ ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్ టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్ జనార్ధనవరం లో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై కొత్త టోల్ పేమెంట్ ప్రారంభం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్ ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్
www.ntodaynews.com

మోడీ, ట్రంప్ దిష్టిబొమ్మల దగ్ధం

తెలంగాణ
09 Feb, 2026 - 07:37 AM
66 వీక్షణలు
    కార్మిక–రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మోడీ, ట్రంప్ దిష్టిబొమ్మల దగ్ధం సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో చిట్యాలలో నిరసన కార్యక్రమం NTODAY NEWS: చిట్యాల కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారనే ఆరోపణలతో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మలను సోమవారం సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకుడు అవిశెట్టి శంకరయ్య మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడితో చేసుకున్న ఒప్పందాల ద్వారా భారత దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టే విధంగా స్వేచ్ఛా వాణిజ్య విధానాలను ప్రధాని మోడీ అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది దేశ ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు.కార్మికుల హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడం, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం, విద్యుత్ సవరణ చట్టం, విత్తన సవరణ చట్టం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి విధానాలను మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకువస్తోందని విమర్శించారు. ఈ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెలో రైతులు, కార్మికులు, కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఐతరాజు నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు ఆరూరి శ్రీనివాస్, లడే రాములు, నర్సిరెడ్డి, మహేష్, సత్యనారాయణ, కిరణ్, శేఖర్, ఐలమ్మ తదితరులు పాల్గొన్నారు. #Chityala #FarmersProtest #WorkersProtest #CITU #NationwideStrike #LabourRights #FarmerIssues Follow us on Website Facebook Instagram YouTube