BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 20 April 2026, 06:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 06:49 PM
143 వీక్షణలు

ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలంలోని కనసానపల్లి గ్రామంలో కోడి పందాలు నిర్వహిస్తున్న స్థావరంపై ఆగిరిపల్లి ఎస్ఐ శుభ శేఖర్ మరియు ఆయన సిబ్బంది సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో 14 మందిని అరెస్ట్ చేయగా, 5,600 రూపాయలు నగదు, 8 మోటార్ సైకిళ్లను, 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ మరియు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ ఆదేశాల మేరకు ఆగిరిపల్లి ఎస్ఐ శుభ శేఖర్ నేతృత్వంలో ఈ దాడి చేపట్టారు.పోలీసుల సమాచారం మేరకు, కనసానపల్లి గ్రామ శివార్లలో కోడి పందాలు నిర్వహిస్తుండగా, పందెం రాయుళ్లను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.కోడి పందాలు, పేకాట వంటి వ్యసనాల పై ఉక్కుపాదం మోపే వారికోసం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిక.ఎస్ఐ శుభ శేఖర్ తెలిపారు, మండలంలో ఈ తరహా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.కోడి పందాలు, పేకాట వంటి వ్యసనాలు తమ భవిష్యత్తును మరియు కుటుంబ గౌరవాన్ని నాశనం చేస్తాయని, వాటి నుండి దూరంగా ఉండాలని హితవు పలికారు.ఈ తరహా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారాన్ని గోప్యంగా పోలీసులు అందించాలనీ చెప్పారు.అదుపులోకి తీసుకున్న 14 మందిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగించామని పోలీసులు వెల్లడించారు.