BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 21 July 2026, 02:53 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు చెరువు కట్ట రోడ్డు పనుల పూర్తికై ఆమరణ నిరాహార దీక్ష

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
21 Jul, 2026 - 02:53 PM
41 వీక్షణలు

పుంగనూరు చెరువు కట్ట రోడ్డు పనుల పూర్తికై బుధవారం (22-07-2026) నుండి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం గురించిన ముందస్తు సమాచారం..

 అన్నమయ్య జిల్లా. పుంగనూరు 

 అయ్యా!

​నేను డాక్టర్ పి. అయూబ్ ఖాన్, సామాజిక కార్యకర్త పుంగనూరు పౌరుడు,

పట్టణ ప్రజల రక్షణ, ప్రయాణ సౌకర్యార్థం ఎదుర్కొంటున్న  సమస్యను మీ దృష్టికి చాలా రోజులు నుంచి మీకు తెలిసిన విషయం,

​పుంగనూరు చెరువు కట్టపై మిగిలి ఉన్న  రోడ్డు పనులను వారం రోజుల్లోగా పూర్తి చేస్తామని సోమవారము (13/06/26) రోడ్లు మరియు భవనాల శాఖ (R&B) డిప్యూటీ ఎక్సక్యూటివ్ ఇంజనీర్ (DEE) గారు స్వయంగా మీడియా ముఖంగా బహిరంగ హామీ ఇచ్చారు. కానీ ఆ గడువు ముగిసి, నేటికీ (సోమవారం) పనులు ప్రారంభం కాకపోవడం అత్యంత విచారకరం. అధికారుల ఈ మాట తప్పిన వైనం మరియు నిర్లక్ష్యం వల్ల ప్రతిరోజూ వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు.

​ప్రజా ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తూ, కాలయాపన చేస్తున్న అధికారుల వైఖరికి నిరసనగా... రాబోయే బుధవారం (తేదీ: 22-07-2026) ఉదయం 10:00 గంటల నుండి పుంగనూరు చెరువు కట్టపై నేను "ఆమరణ నిరాహార దీక్ష" చేపట్టాలని నిర్ణయించుకున్నాను.

​ఈ దీక్ష పూర్తిగా శాంతియుత మార్గంలో, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందని తెలియజేస్తున్నాను. కావున, శాంతిభద్రతల దృష్ట్యా ఈ విషయమై మీకు ముందస్తు సమాచారం అందిస్తూ, తగిన సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాను.

​ధన్యవాదాలతో,

​ఇట్లు,

(డాక్టర్ పి. అయూబ్ ఖాన్)

నకలు 

​జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) గారికి,  (సమాచారం నిమిత్తం).

​R&B ఎక్సక్యూటివ్ ఇంజనీర్ (EE) గారికి,  (సమాచారం నిమిత్తం).