BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 21 July 2026, 02:54 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jul, 2026 - 02:54 PM
84 వీక్షణలు

తిరువూరులో మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్‌లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే 84వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మల్లికార్జున ఖర్గే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఖర్గే 1972 నుంచి 2009 వరకు కర్ణాటక శాసనసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పీసీసీ అధ్యక్షుడిగా, అనంతరం పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా, ప్రస్తుతం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రానికి, దేశానికి, కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు.

అలాగే, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను విమర్శించారు. పరీక్షా పత్రాల లీకేజీలపై ఢిల్లీలో శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్, విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తిరువూరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు ప్రకాశరావు, తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లెపాటి శ్రీనివాసరావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జీవన్ బాబు, బీసీ రాష్ట్ర నాయకుడు గంజ కృష్ణమోహన్, కాంగ్రెస్ నాయకులు కొత్తగుండ్ల గోపాలకృష్ణ, ఇజ్జాడ జగన్నాథరావు, గంధం శ్రీనివాసరావు, ఇమ్మనేని శ్రీనివాసరావు, పర్వతం రామారావు, చిన్నంశెట్టి నాగేశ్వరరావు, పగుట్ల చంద్రయ్య, యద్దనపూడి రాములు తదితరులు పాల్గొన్నారు.