ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకిన తల్లి.. ముగ్గురి మృతి
తెలంగాణ
/
మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా: కురవి మండలం లింగ్య తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనలో బానోత్ అనూష (35), ఆమె కుమారుడు విశాల్ కృష్ణ (9), కుమార్తె వర్షిణి (5) మృతి చెందినట్లు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో తండాలో విషాదం నెలకొంది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, కుటుంబ కలహాలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉంది.