తిరువూరులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
చైర్మన్ అభ్యర్థి పసుపులేటి మాధవి, 18వ వార్డు అభ్యర్థి కొంగల వెంకట రమణమ్మకు మద్దతుగా ప్రచారం తిరువూరు (ఎన్టీఆర్ జిల్లా): తిరువూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పసుపులేటి మాధవి, 18వ వార్డు అభ్యర్థి కొంగల వెంకట రమణమ్మ విజయాన్ని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ మాదిగ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అభ్యర్థుల గెలుపు కోసం ప్రజలను కలిసి మద్దతు కోరారు. ఎన్నికల్లో అభ్యర్థులకు ప్రజలు అండగా నిలిచి విజయాన్ని అందించాలని కోరారు.