BREAKING
thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు thumb ● నిత్యావసర ధరలకు కళ్లెం వేయాలి thumb ● ఐలు రామన్నపేట కోర్టు కమిటీ అధ్యక్షుడిగా యాదాసు యాదయ్య ఎన్నిక thumb ● ఆరుట్లలో అఖిలపక్ష సమావేశం.. జాతర సమీక్షపై వివాదం thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు thumb ● నిత్యావసర ధరలకు కళ్లెం వేయాలి thumb ● ఐలు రామన్నపేట కోర్టు కమిటీ అధ్యక్షుడిగా యాదాసు యాదయ్య ఎన్నిక thumb ● ఆరుట్లలో అఖిలపక్ష సమావేశం.. జాతర సమీక్షపై వివాదం
మంచి మాట
Date of Publish : 30 October 2026, 10:39 am
Posted by : PABBINEEDI B SANKAR

RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
Pabbineedi B Sankar Tellapur Mandal
30 Oct, 2026 - 10:39 AM
31 వీక్షణలు

బీటీ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు జోనల్ కమిషనర్ ఆదేశాలు

ప్రమాదాల నివారణకు సైన్‌బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తామని హామీ

తెల్లాపూర్, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):

తెల్లాపూర్ 263వ డివిజన్ పరిధిలోని RR-30 విస్తరణ రహదారిపై దెబ్బతిన్న ప్రాంతాలను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మాలెంపాటి, ఐఏఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. TeNA బృందం, తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ కంజర్ల శ్రీశైలం అభ్యర్థన మేరకు గురువారం ఉదయం ఈ తనిఖీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మై హోమ్ RMC ప్లాంట్, మేఫెయిర్ కార్నర్, హుడా టర్నింగ్, ఏలియన్స్ సర్కిల్ ప్రాంతాల్లో రహదారుల పరిస్థితిని అధికారులు పరిశీలించారు. హుడా టర్నింగ్ నుంచి ఏలియన్స్ సర్కిల్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ వరకు కనీసం ఒక పొర బీటీ రోడ్డు నిర్మించాలని ప్రతినిధులు కోరారు.

దీనిపై స్పందించిన జోనల్ కమిషనర్ రహదారి పనులు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పటాన్‌చెరు సర్కిల్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన సైన్‌బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల పరిశుభ్రతకు సంబంధించిన సమస్యలను కూడా ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అధికారుల సమక్షంలో క్షేత్రస్థాయి తనిఖీ

ఈ తనిఖీలో పటాన్‌చెరు సర్కిల్‌కు చెందిన డిప్యూటీ కమిషనర్ (DC), డిప్యూటీ ఇంజినీర్ (DE), ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (EE) తదితర అధికారులు పాల్గొన్నారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేసుకుంటూ, రహదారి పనులు సకాలంలో పూర్తయ్యేలా పర్యవేక్షిస్తామని మాజీ కౌన్సిలర్ కంజర్ల శ్రీశైలం, TeNA బృందం వెల్లడించింది.