మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం
తెలంగాణ
/
నల్గొండ
/
మునుగోడు
- 50 సంవత్సరాలు పైబడిన వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలి.
- తమ ఫోన్ నంబర్, గతంలో వాడుతున్న మందులను వెంట తీసుకురావాలి.
- కంటి శుక్లాల (క్యాటరాక్ట్) ఆపరేషన్ అవసరమైన వారిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేయించి తిరిగి తీసుకువస్తారు.
సమయం: ఉదయం 9 గంటల నుంచి
నవంబర్ 1న కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ
మునుగోడు మండల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు.
ఈ శిబిరం 2026 నవంబర్ 1వ తేదీ ఆదివారం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానుంది. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
ముఖ్య సూచనలు:
వేదిక: మునుగోడు క్యాంపు కార్యాలయం
మండల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకుని కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఫౌండేషన్ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.