దేవాలయం రహస్యం ఏమిటి...
మానవ చైతన్య స్థానమే దేవాలయం,
దేవత కొలువై ఉన్న స్థలమే దేవస్థానం,
కోరిన కోరికలు తీర్చేదే కోవెల.
వేదకాలంలో ఋషులు,మునులు,మహర్షులు యజ్ఞ యాగాల రూపంలో తపస్సు రూపంలో దేవతలను దర్శించేవారు.
ఆ తర్వాత తపస్సు రూపంలో ఋషులు మునులు మహర్షులు దర్శించిన దేవతారూపాలే దేవతా విగ్రహాలు వారు విన్న శబ్ధాలే మంత్రాలు.ఆ దేవతా విగ్రహాలను ఆయా దేవతామూర్తుల మంత్రాలతో యంత్రాలతో యజ్నయాగాది ప్రతిష్ఠ క్రతువులతో దేవతలకు ప్రాణం పోసి మానవుల మనస్సు లో ఉండే సంకల్పాలను నెరవేర్చే పవిత్ర స్థలమే దేవాలయం.
హిందూ ధర్మం లో దేవాలయం ప్రముఖపాత్ర వహిస్తుంది.పూర్వం నుంచి దేవాలయం లోనే సమాజంలోని మంచి చెడులను గురించి అభివృద్ధి గురించి చర్చించేవారు.సమాజంలోని సమస్యలు దేవాలయం ముందు పెద్దలు చర్చించి నిర్ణయం చేసేవారు.ఆలయాల్లో ధర్మ బోధనలు, న్యాయం ,తర్కం ,గణితం,జీవన విధానాలు,చదువులు చెప్పేవారు.
భారతదేశంలో దేవాలయ నిర్మాణ సంప్రదాయం సుమారు 2,300 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు చారిత్రక, పురావస్తు ఆధారాలు తెలియజేస్తున్నాయి. అయితే అంతకంటే ముందే దేవతా ఆరాధన, యజ్ఞ సంప్రదాయాలు భారతీయ సంస్కృతిలో భాగంగా కొనసాగాయి.
క్రీ.పూ. 3వ శతాబ్దం: ప్రారంభ ఆలయ నిర్మాణాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి.క్రీ.పూ. 2వ శతాబ్దం: విష్ణు ఆరాధనకు సంబంధించిన ఆలయ అవశేషాలు లభించాయి.
క్రీ.శ. 4–5వ శతాబ్దాలు: శాశ్వత రాతి, ఇటుక దేవాలయ నిర్మాణాలు విస్తృతంగా అభివృద్ధి చెందాయి.
దేవాలయాన్ని ఆలయం, మందిరం, దేవస్థానం, దేవగృహం, దేవకులం, దేవనిలయం, దేవసదనం, దేవమందిరం, గుడి, కోవెల, క్షేత్రం, పుణ్యక్షేత్రం, సన్నిధి, సన్నిధానం, ప్రాసాదం, దేవప్రాసాదం, దైవస్థానం, దైవాలయం, దైవనిలయం, దైవగృహం, దేవగుడి, దేవస్థలి, దేవనికేతనం, దేవధామం, దేవపురం, దేవారాధనాలయం, పుణ్యస్థలం, పవిత్రస్థలం, దేవసన్నిధానం, దైవసన్నిధి, దేవకేతనం, దేవభవనం, దేవనివాసం వంటి వివిధ పేర్లతో పిలుస్తారు.
నేటి ఆధునిక కాలంలో గుడి బడి లేని ఊరు లేదు.ఎన్ని సంవత్సరాలు మారినా భక్తి మారలేదు.మనిషికి దేవుడికి అవినాభావ సంబంధం ఉంది.భగవంతుడి ఆలయం చేరుకున్న భక్తుడు ప్రశాంతత శాంతి ని ఆనందాన్ని పొందుతాడు.తాను అనుకున్న విషయాలు దేవుడితో పంచుకుంటాడు.పాజిటివ్ ఎనర్జీని పొందుతాడు.అందుకే దేవాలయల నిర్మాణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
రచయిత
Shashikanth Sriramoju
Spiritual Writer
Purohith & Astrologist
Hindu Dharma | Temple Traditions | Vedic & Puranic Studies | Astrology
Contact 9248681758