BREAKING
thumb ● కాసులు కురిపించే కార్తీకమాసం నవంబర్ 09 నుంచి ప్రారంభం... thumb ● రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నవీన్ కుటుంబానికి రూ.1.50 లక్షల ఆర్థిక సాయం thumb ● గంగారంలో ఘనంగా కొమరం భీం 86వ వర్ధంతి thumb ● ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు thumb ● మహమ్మదాపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● కదిరిలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం thumb ● మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎండీ రహీం షరీఫ్ thumb ● సొంత గ్రామంలో 26 లక్షలతో రహదారి నిర్మాణం thumb ● నారాయణపురంలో తాగునీటి పనులకు రూ.10 లక్షల నిధులు thumb ● వినాయకుడి పూజలతో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ప్రారంభం thumb ● కాసులు కురిపించే కార్తీకమాసం నవంబర్ 09 నుంచి ప్రారంభం... thumb ● రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నవీన్ కుటుంబానికి రూ.1.50 లక్షల ఆర్థిక సాయం thumb ● గంగారంలో ఘనంగా కొమరం భీం 86వ వర్ధంతి thumb ● ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు thumb ● మహమ్మదాపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● కదిరిలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం thumb ● మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎండీ రహీం షరీఫ్ thumb ● సొంత గ్రామంలో 26 లక్షలతో రహదారి నిర్మాణం thumb ● నారాయణపురంలో తాగునీటి పనులకు రూ.10 లక్షల నిధులు thumb ● వినాయకుడి పూజలతో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ప్రారంభం
మంచి మాట
Date of Publish : 28 October 2026, 05:35 pm
Posted by : SHASHIKANTH SRIRAMOJU

కాసులు కురిపించే కార్తీకమాసం నవంబర్ 09 నుంచి ప్రారంభం...

భక్తి భక్తి
28 Oct, 2026 - 05:35 PM
28 వీక్షణలు

కాసులు కురిపించే కార్తీకమాసం నవంబర్ 09  నుంచి ప్రారంభం...

హైందవ ధర్మంలో కార్తీక మాసానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది... శివ కేశవులకు ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం.ఈమాసంలో నిర్వహించే ఉపవాసాలకు, వ్రతాలూ, దీక్షలకు రెట్టింపు ఫలితాలను ఇస్తుంది.

ఈ మాసం లోనే హరిహరసుతుడు అయ్యప్ప స్వామి మండలం దీక్ష తీసుకునే భక్తులు మాల ధరిస్తారు.కార్తీకదామోదర వ్రతము కూడా నిర్వహిస్తారు.

ఈమాసంలో భగవదారాధన చేయడం వలన మానవుల కోరికలు సిద్ధిస్తాయని ప్రతీతి.ఈమాసంలో ప్రతి రోజూ ఉదయం బ్రాహ్మీముహూర్తంలో తెల్లవారుజామున 04-00 నుంచి 06-00 లోపు సాయంత్రం 4-00నుంచి 06-00 సమయం లో ఇంట్లో దీపారాధన చేసి‌ ఇంట్లో నిత్య‌ దీపారాధన ఎవరైతే చేసుకుంటారో వారికి తప్పకుండా వారు కోరుకున్నది నెరవేరుతుంది.

న కార్తికసమో మాసో

న కృతేన సమం యుగమ్।

న వేదసదృశం శాస్త్రం

న తీర్థం గంగయా సమమ్॥

కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు, కృతయుగంతో సమానమైన యుగం లేదు,వేదాలతో సమానమైన శాస్త్రం లేదు, గంగతో సమానమైన తీర్థం లేదు అని ధర్మ గ్రంథాలు చెబుతున్నాయి.

కార్తీక వనభోజనాలు

మన సాంప్రదాయం ప్రకారం కార్తీకమాసం వనభోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.ప్రకృతి లో ఉసిరి చెట్టు కింద సత్యనారాయణ వ్రతం చేసుకొని అక్కడే అనంతరం భోజనాలు చేయడం, అన్నదానం చేయడం కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తారు.

దీప దానాలు..

  • దీపం జ్యోతి పరబ్రహ్మ
  • దీపం సర్వత మోపహం
  • దీపేన సాధ్యతే సర్వం
  • సంధ్యా దీపం నమోస్తుతే...

దీపం సాక్ష్యాత్తు పరబ్రహ్మ స్వరూపం.దీపం లేనిది వెలుగు లేదు

దీపం తోనే వెలుగు తోనే ఏదైనా సాధ్యమవుతుంది అని ఈ శ్లోకం చెప్తుంది.దీపాన్ని దానం ఇదే మాసం లో దీపదానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది .కార్తీక పౌర్ణమి ఈ మాసంలో అత్యంత విశిష్టమైన పర్వదినాల్లో ఒకటి. ఈ రోజున ఆలయాల్లో ప్రత్యేక పూజలు, దీపోత్సవాలు, జ్వాలాతోరణం వంటి కార్యక్రమాలు కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తారు. భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శించి దైవదర్శనం చేసుకుంటారు. పవిత్ర స్నానాలు, దీపారాధనలు, దానధర్మాలు నిర్వహించడం ఈ పర్వదినం ప్రత్యేకత.

ఈ కార్తీక మాసంలోనే కేదారేశ్వర వ్రతము

అన్యోన్య దాంపత్యానికి ఆదిదంపతులు నిర్వహించిన కేదారేశ్వర వ్రతము ను కూడా ఈ మాసం లో నిర్వహిస్తారు.

తెలంగాణ ప్రాంతాల్లో దంపతులు కేదారేశ్వర వ్రతము నోములు నిర్వహించుకుంటారు‌‌. కుటుంబ పెద్దలు ఆచారంగా వచ్చిన విధానాలతో తమ సంతానానికి నేర్పిస్తారు