సొంత గ్రామంలో 26 లక్షలతో రహదారి నిర్మాణం
సొంత గ్రామంలో రూ.26 లక్షలతో రహదారి నిర్మాణం
రాజన్న బావిగూడెం అభివృద్ధికి చలమల్ల కృష్ణారెడ్డి ప్రత్యేక చొరవ
యాదాద్రి:నారాయణపురం: అక్టోబర్ 28 : సంస్థాన్ నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రాజన్న బావిగూడెంలో రూ.26 లక్షల సొంత నిధులతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి ప్రారంభించారు.
తన సొంత గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు, రాకపోకల్లో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారంగా సొంత నిధులు వెచ్చించి రహదారి నిర్మాణానికి ముందుకు రావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మల్లారెడ్డిగూడెం గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఉపసర్పంచ్‌లు, మాజీ వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.