పైపులైన్ మరమ్మతులతో 131 ఆవాసాలకు తాగునీటి సరఫరా నిలిపివేత
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
- బుధవారం పలు మండలాల్లో నీటి సరఫరాకు అంతరాయం
నల్లగొండ | ఎన్ టుడే న్యూస్:
నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. పానగల్ 59 ఎంఎల్‌డీ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నుంచి గోపలాయపల్లి వరకు ఉన్న 700 ఎంఎం ప్రధాన పైపులైన్ లీకేజీ మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.
ఈ మరమ్మతుల కారణంగా కట్టంగూరు, నల్లగొండ, నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేట, మునుగోడు మండలాల్లోని 131 ఆవాసాలతో పాటు చిట్యాల మున్సిపాలిటీకి తాగునీటి సరఫరా నిలిచిపోనుంది.
ఈ విషయాన్ని మిషన్ భగీరథ ఏఈఈ వెల్లడించారు. నీటి సరఫరా నిలిచిపోనున్న నేపథ్యంలో ప్రజలు ముందస్తుగా అవసరమైన నీటిని నిల్వ చేసుకోవాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.