WPL వేలం నేడు కొచ్చిలో.. 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు
- UP వారియర్స్ వద్ద అత్యధికంగా రూ.3.75 కోట్లు
- వేలం జాబితాలో స్టార్ ప్లేయర్లు
కొచ్చి | ఎన్ టుడే న్యూస్: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్‌కు సంబంధించి మినీ వేలం నేడు (అక్టోబర్ 28) కేరళలోని కొచ్చిలో జరగనుంది. ఐదు ఫ్రాంచైజీలు తమ జట్లలో మిగిలిన 27 స్థానాలను భర్తీ చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. మొత్తం 146 మంది ప్లేయర్లు వేలం జాబితాలో చోటు దక్కించుకున్నారు. వేలం సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానుంది.
వేలానికి ముందు జట్ల వద్ద ఉన్న నిధులు, ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. UP వారియర్స్ వద్ద రూ.3.75 కోట్లు ఉండగా, 8 స్థానాలను భర్తీ చేసుకోవాల్సి ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వద్ద రూ.1.15 కోట్లు ఉండగా, 5 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్ (MI) వద్ద రూ.90 లక్షలు మాత్రమే ఉండగా, 6 స్థానాలను భర్తీ చేసుకోవాల్సి ఉంది.
సోఫీ మోలినాక్స్, సోఫియా డంక్లీ, చమారి ఆటపట్టు, జెస్ జోనసెన్, హీథర్ గ్రాహమ్, గ్రేస్ హ్యారిస్, జి. కమలిని, స్నేహ్ రాణా వంటి ఆటగాళ్లు వేలం జాబితాలో ఉన్నారు. పరిమిత స్థానాలు, అందుబాటులో ఉన్న బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఫ్రాంచైజీలు తమ జట్ల అవసరాలకు అనుగుణంగా ఆటగాళ్లను ఎంపిక చేసుకోనున్నాయి.
WPL 2027 సీజన్ 2027 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరగనుంది. ఈ వేలంతో జట్ల కూర్పుపై స్పష్టత రానుంది.