BREAKING
thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు thumb ● మైదుకూరులో మాజీ కౌన్సిలర్‌పై దాడి? thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్ thumb ● వేముల మండలంలో టీడీపీకి 8కి 8 ఎంపీటీసీ స్థానాలు thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు thumb ● మైదుకూరులో మాజీ కౌన్సిలర్‌పై దాడి? thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్ thumb ● వేముల మండలంలో టీడీపీకి 8కి 8 ఎంపీటీసీ స్థానాలు
మంచి మాట
Date of Publish : 28 October 2026, 10:38 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
28 Oct, 2026 - 10:38 AM
3 వీక్షణలు

సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచన

స్థానిక సంస్థల ఎన్నికలు | ఎన్ టుడే న్యూస్‌:

మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకురాలు, ఐఏఎస్ అధికారి పి. ప్రశాంతి సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లు, ఇతర సంబంధిత అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మండలంలోని అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాలను సమస్యాత్మకంగా గుర్తించడానికి గల కారణాలు, గత ఎన్నికల సమయంలో ఎదురైన పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు, ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలపై సమీక్షించారు.

ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి వి.ఆర్. రుద్ర, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పి.వి.ఆర్.కె. రాజు, ఆర్.డి. రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.