తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు
ఆంధ్రప్రదేశ్
/
తిరుపతి
బీజేపీ అభ్యర్థి వై కృష్ణయ్యతో జనసేన అభ్యర్థి మణి యానాది తలపడుతున్నారు
తొట్టంబేడు | ఎన్ టుడే న్యూస్:
తొట్టంబేడు మండలంలోని చిట్టత్తూరు ఎంపీటీసీ స్థానానికి బీజేపీ, జనసేన అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. కూటమి పార్టీలకు చెందిన అభ్యర్థులు పరస్పరం పోటీ పడుతుండటంతో ఈ స్థానం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
చిట్టత్తూరు ఎంపీటీసీ స్థానానికి బీజేపీ తరఫున వై. కృష్ణయ్య, జనసేన తరఫున మణి యానాది పోటీలో ఉన్నారు. ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు విజయం సాధిస్తారనే దానిపై మండల ప్రజల్లో ఆసక్తి నెలకొంది.