BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపూర్‌లో నాటు కోళ్లకు విషప్రయోగం? thumb ● వైట్ ప్లేట్ వాహనాలతో ప్రయాణికుల తరలింపుపై టాక్సీ అసోసియేషన్ ఆందోళన thumb ● పైపులైన్‌ మరమ్మతులతో 131 ఆవాసాలకు తాగునీటి సరఫరా నిలిపివేత thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు thumb ● సంస్థాన్ నారాయణపూర్‌లో నాటు కోళ్లకు విషప్రయోగం? thumb ● వైట్ ప్లేట్ వాహనాలతో ప్రయాణికుల తరలింపుపై టాక్సీ అసోసియేషన్ ఆందోళన thumb ● పైపులైన్‌ మరమ్మతులతో 131 ఆవాసాలకు తాగునీటి సరఫరా నిలిపివేత thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు
మంచి మాట
Date of Publish : 28 October 2026, 01:10 pm
Posted by : KOLA MAHESH

సంస్థాన్ నారాయణపూర్‌లో నాటు కోళ్లకు విషప్రయోగం?

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
28 Oct, 2026 - 01:10 PM
17 వీక్షణలు

వారం వ్యవధిలో రెండు ఘటనలు.. 40 కోళ్లు మృతి

సంస్థాన్ నారాయణపూర్, యాదాద్రి భువనగిరి జిల్లా | ఎన్ టుడే న్యూస్‌:

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం వావిళ్లపల్లి గ్రామంలో నాటు కోళ్ల మృతికి సంబంధించిన రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. వ్యవసాయ బావుల వద్ద పెంచుకుంటున్న కోళ్లు గుర్తుతెలియని వ్యక్తులు విషం కలిపిన ఆహారం వేయడంతో మృతి చెందినట్లు బాధిత రైతులు ఆరోపిస్తున్నారు.

గ్రామానికి చెందిన జక్కర్తి రఘుపతికి చెందిన సుమారు 20 నాటు కోళ్లు, కొంక చంద్రయ్యకు చెందిన మరో 20 కోళ్లు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. బియ్యంలో విషపదార్థం కలిపి చల్లడంతో కోళ్లు తిని చనిపోయాయని వారు అనుమానం వ్యక్తం చేశారు.

వారం తిరగకముందే రెండు ఘటనలు జరగడంతో బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల మృతితో తమకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనలకు పాల్పడుతున్నారని వారు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనలపై సంబంధిత అధికారులు, పోలీసులు విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. కోళ్ల మృతికి గల కారణాలు అధికారిక విచారణలో తేలాల్సి ఉంది.