అర్నబ్ తుఫాన్ ప్రభావం.. ములుగు జిల్లాలో చిరుజల్లులు
తెలంగాణ
/
ములుగు
- వరి పొట్ట దశలో ఉండటంతో రైతుల్లో ఆందోళన
- కోతకు సిద్ధమైన ధాన్యం తడిసిపోతుందేమోనని ఆవేదన
ములుగు | ఎన్ టుడే న్యూస్:
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేటతో పాటు పలు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి చిరుజల్లులు కురిశాయి. చల్లటి గాలులు వీయడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉండటంతో పాటు కొన్ని ప్రాంతాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కోసిన వరి ధాన్యం వర్షానికి తడిసిపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు మరింత కొనసాగితే పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కోసిన ధాన్యాన్ని తడవకుండా భద్రపరచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.