కోతి దాడిలో గాయపడిన మహిళ మృతి
తెలంగాణ
/
ములుగు
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో కోతి దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది.
కమలాపురం ఎస్సీ కాలనీకి చెందిన సుమిత్ర (55) ఓ హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగించేది. నెల రోజుల క్రితం ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో కోతి దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆమెను ములుగు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సుమిత్ర మంగళవారం మృతి చెందింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.