తెలంగాణలో పంటల ధరలకు రెక్కలు
మిర్చి క్వింటాల్ రూ.31 వేలు.. పసుపు రూ.19 వేలు
వరంగల్, మహబూబాబాద్‌లో మక్కలకు రూ.3,085
పత్తి క్వింటాల్‌కు రూ.9,070
తెలంగాణ | ఎన్ టుడే న్యూస్:
ఎల్‌నినో ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పంటల ధరలు పెరుగుతున్నాయి. దిగుబడులు తగ్గే అవకాశం ఉందన్న అంచనాలతో వ్యాపారులు కనీస మద్దతు ధరను మించి పలు పంటలను కొనుగోలు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. ముఖ్యంగా మిర్చి, పసుపు ధరలు గణనీయంగా పెరిగాయి.
వరంగల్, మహబూబాబాద్ మార్కెట్లలో క్వింటాల్ మొక్కజొన్న ధర రూ.3,085 పలికింది. తేజా మిర్చి నాన్ ఏసీ రకం క్వింటాల్‌కు రూ.23 వేలకుపైగా ధర పలుకుతుండగా, ఏసీ రకం రూ.31 వేల స్థాయికి చేరినట్లు సమాచారం.
ఇక పసుపు క్వింటాల్‌కు రూ.19 వేల ధర పలకగా, పత్తి క్వింటాల్‌కు రూ.9,070 ధర నమోదైంది. దిగుబడులు, మార్కెట్‌కు వచ్చే సరుకు పరిమాణం, కొనుగోలుదారుల డిమాండ్ ఆధారంగా ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.