BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపూర్‌లో నాటు కోళ్లకు విషప్రయోగం? thumb ● వైట్ ప్లేట్ వాహనాలతో ప్రయాణికుల తరలింపుపై టాక్సీ అసోసియేషన్ ఆందోళన thumb ● పైపులైన్‌ మరమ్మతులతో 131 ఆవాసాలకు తాగునీటి సరఫరా నిలిపివేత thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు thumb ● సంస్థాన్ నారాయణపూర్‌లో నాటు కోళ్లకు విషప్రయోగం? thumb ● వైట్ ప్లేట్ వాహనాలతో ప్రయాణికుల తరలింపుపై టాక్సీ అసోసియేషన్ ఆందోళన thumb ● పైపులైన్‌ మరమ్మతులతో 131 ఆవాసాలకు తాగునీటి సరఫరా నిలిపివేత thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు
మంచి మాట
Date of Publish : 28 October 2026, 01:07 pm
Posted by : PABBINEEDI B SANKAR

వైట్ ప్లేట్ వాహనాలతో ప్రయాణికుల తరలింపుపై టాక్సీ అసోసియేషన్ ఆందోళన

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
Pabbineedi B Sankar Tellapur Mandal
28 Oct, 2026 - 01:07 PM
11 వీక్షణలు
  • అక్రమ వాణిజ్య రవాణాపై చర్యలు తీసుకోవాలని జీఎంఆర్ టాక్సీ అసోసియేషన్ డిమాండ్

పటాన్‌చెరు | ఎన్ టుడే న్యూస్‌:

వైట్ ప్లేట్ వాహనాలతో ప్రయాణికులను తరలిస్తూ తమ జీవనోపాధికి నష్టం కలిగిస్తున్నారని జీఎంఆర్ టాక్సీ అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణికులను తక్కువ ధరలకు తెలంగాణకు తీసుకొస్తున్నారని వారు ఆరోపించారు.

నిబంధనల ప్రకారం పన్నులు, ఫిట్‌నెస్, గ్రీన్ ట్యాక్స్ తదితర రుసుములు చెల్లిస్తూ టాక్సీ సేవలు అందిస్తున్నామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ ఖర్చుల కోసం ఏడాదికి సుమారు రూ.లక్ష వరకు వ్యయం అవుతోందని పేర్కొన్నారు. అయితే, శబరిమల, తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలకు ప్రైవేట్ వాహనాల్లో తక్కువ ధరలకు ప్రయాణికులను తీసుకెళ్తుండటంతో తమకు బుకింగ్‌లు తగ్గి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య రవాణా జరుగుతోందన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని వారు కోరారు. నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని జీఎంఆర్ టాక్సీ అసోసియేషన్ సభ్యులు హెచ్చరించారు.