రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
తెలంగాణ
/
జనగామ
- బైక్ అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలు
జఫర్‌గఢ్ | ఎన్ టుడే న్యూస్:
జనగామ జిల్లాలోని జఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన అఖిల్ (22) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అమ్మమ్మ అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
గ్రామ సమీపంలో అఖిల్ ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి కిందపడటంతో అతడికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి అఖిల్ మృతి చెందాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.