BREAKING
thumb ● మహమ్మదాపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● కదిరిలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం thumb ● మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎండీ రహీం షరీఫ్ thumb ● సొంత గ్రామంలో 26 లక్షలతో రహదారి నిర్మాణం thumb ● నారాయణపురంలో తాగునీటి పనులకు రూ.10 లక్షల నిధులు thumb ● వినాయకుడి పూజలతో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ప్రారంభం thumb ● సంస్థాన్ నారాయణపూర్‌లో నాటు కోళ్లకు విషప్రయోగం? thumb ● వైట్ ప్లేట్ వాహనాలతో ప్రయాణికుల తరలింపుపై టాక్సీ అసోసియేషన్ ఆందోళన thumb ● పైపులైన్‌ మరమ్మతులతో 131 ఆవాసాలకు తాగునీటి సరఫరా నిలిపివేత thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహమ్మదాపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● కదిరిలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం thumb ● మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎండీ రహీం షరీఫ్ thumb ● సొంత గ్రామంలో 26 లక్షలతో రహదారి నిర్మాణం thumb ● నారాయణపురంలో తాగునీటి పనులకు రూ.10 లక్షల నిధులు thumb ● వినాయకుడి పూజలతో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ప్రారంభం thumb ● సంస్థాన్ నారాయణపూర్‌లో నాటు కోళ్లకు విషప్రయోగం? thumb ● వైట్ ప్లేట్ వాహనాలతో ప్రయాణికుల తరలింపుపై టాక్సీ అసోసియేషన్ ఆందోళన thumb ● పైపులైన్‌ మరమ్మతులతో 131 ఆవాసాలకు తాగునీటి సరఫరా నిలిపివేత thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
మంచి మాట
Date of Publish : 28 October 2026, 03:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి ఎంపీటీసీ ఎన్నికల బరిలో 32 మంది రిటర్నింగ్ అధికారి అనురాధ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Oct, 2026 - 03:36 PM
12 వీక్షణలు

చాట్రాయి, ఏలూరు జిల్లా: చాట్రాయి మండలంలో ఎంపీటీసీ ఎన్నికల బరిలో 32 మంది అభ్యర్థులు నిలిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాధ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికావడంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ తరఫున 13 మంది, జనసేన పార్టీ తరఫున ఇద్దరు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 15 మంది, లిబరేషన్ పార్టీ తరఫున ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు పోటీలో ఉన్నట్లు వివరించారు. అభ్యర్థులందరికీ బీ-ఫారాలు అందడంతో ఎన్నికల గుర్తుల కేటాయింపు కూడా పూర్తయిందని తెలిపారు. టీడీపీ నుంచి 13 మంది అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ తరఫున కృష్ణారావుపాలెం నుంచి కల్లేపల్లి జ్యోతి, చనుబండ నుంచి తీర్థాల అద్భుతరావు, చీపురుగూడెం నుంచి రేగులు వెంకటేశ్వరరావు, చిత్తపూరు నుంచి చల్లగుండ్ల పద్మావతి, జనార్దనవరం నుంచి అంబోజు పెద్ద సీతయ్య, చిన్నంపేట నుంచి కొమ్ము సుజనరావు, బూరుగుగూడెం నుంచి బూబత్తుల నాగస్వరూప, కోటపాడు నుంచి మోదుగుమూడి రమేష్, కొత్తగూడెం నుంచి భాస్కర లక్ష్మి మహదేవ, నరసింహారావుపాలెం నుంచి కోట పూజిత, మర్లపాలెం నుంచి గంధాని సత్యనారాయణ, పోలవరం నుంచి చల్లగుళ్ల రాజ్యలక్ష్మి, తుమ్మగూడెం నుంచి కొల్లి సత్యావతి పోటీలో ఉన్నారు. జనసేన నుంచి ఇద్దరు జనసేన పార్టీ తరఫున చాట్రాయి నుంచి సవరం రామలక్ష్మి, పోతనపల్లి నుంచి తుమ్మలపల్లి పాపారావు ఎన్నికల బరిలో నిలిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 15 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున చనుబండ నుంచి బన్నే రాంబాబు, చీపురుగూడెం నుంచి గొల్లమందల నారాయణరావు, చిత్తపూరు నుంచి బేతిన అమ్మాజీ, జనార్దనవరం నుంచి తిరివీధి పెద్దన్న, చిన్నంపేట నుంచి కారుమంచి దావీదు, కృష్ణారావుపాలెం నుంచి మల్లు విజయలక్ష్మి, బూరుగుగూడెం నుంచి వంగల నాగలక్ష్మి, కొత్తగూడెం నుంచి అంగడాల వరలక్ష్మి, కోటపాడు నుంచి మల్లెల్లి శ్రీనివాసరావు, నరసింహారావుపాలెం నుంచి కోట విజయమ్మ, మర్లపాలెం నుంచి పర్వతనేని వెంకటేశ్వరరావు, పోలవరం నుంచి రాజులపాటి జ్యోతి, చాట్రాయి నుంచి అంబటి వెంకట నాగలక్ష్మి, పోతనపల్లి నుంచి మోతినేని స్వాతి, తుమ్మగూడెం నుంచి మూడీ యశోద పోటీలో ఉన్నారు. లిబరేషన్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు చిత్తపూరు ఎంపీటీసీ స్థానం నుంచి లిబరేషన్ పార్టీ తరఫున కలపాల జ్యోతి, పోలవరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పానుగంటి రజిని ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసి అభ్యర్థుల జాబితా ఖరారు కావడంతో మండలంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. అభ్యర్థులు తమ తమ ప్రాంతాల్లో ఓటర్లను కలుస్తూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది