మహమ్మదాపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణ
/
నల్గొండ
/
నాంపల్లి
నాంపల్లి | ఎన్ టుడే న్యూస్: నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మహమ్మదాపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బొమ్మ సంతోష చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జీపీఓ మనోహర్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకుని, వాటిని ప్రభుత్వ పథకాల కోసం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ బాల్‌రెడ్డి, ఉపసర్పంచ్ సైదమ్మ, బీఎల్‌వోలు, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.