BREAKING
thumb ● మహమ్మదాపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● కదిరిలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం thumb ● మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎండీ రహీం షరీఫ్ thumb ● సొంత గ్రామంలో 26 లక్షలతో రహదారి నిర్మాణం thumb ● నారాయణపురంలో తాగునీటి పనులకు రూ.10 లక్షల నిధులు thumb ● వినాయకుడి పూజలతో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ప్రారంభం thumb ● సంస్థాన్ నారాయణపూర్‌లో నాటు కోళ్లకు విషప్రయోగం? thumb ● వైట్ ప్లేట్ వాహనాలతో ప్రయాణికుల తరలింపుపై టాక్సీ అసోసియేషన్ ఆందోళన thumb ● పైపులైన్‌ మరమ్మతులతో 131 ఆవాసాలకు తాగునీటి సరఫరా నిలిపివేత thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహమ్మదాపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● కదిరిలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం thumb ● మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎండీ రహీం షరీఫ్ thumb ● సొంత గ్రామంలో 26 లక్షలతో రహదారి నిర్మాణం thumb ● నారాయణపురంలో తాగునీటి పనులకు రూ.10 లక్షల నిధులు thumb ● వినాయకుడి పూజలతో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ప్రారంభం thumb ● సంస్థాన్ నారాయణపూర్‌లో నాటు కోళ్లకు విషప్రయోగం? thumb ● వైట్ ప్లేట్ వాహనాలతో ప్రయాణికుల తరలింపుపై టాక్సీ అసోసియేషన్ ఆందోళన thumb ● పైపులైన్‌ మరమ్మతులతో 131 ఆవాసాలకు తాగునీటి సరఫరా నిలిపివేత thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
మంచి మాట
Date of Publish : 28 October 2026, 03:37 pm
Posted by : A. MURALIDHAR

వినాయకుడి పూజలతో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
A. Muralidhar చౌడేపల్లి మండల ప్రతినిధి
28 Oct, 2026 - 03:37 PM
36 వీక్షణలు

చౌడేపల్లి, అన్నమయ్య జిల్లా | ఎన్ టుడే న్యూస్‌: చౌడేపల్లి మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. మండల జడ్పీటీసీ అభ్యర్థి డి. శ్రీవిద్య అంకుతోటపల్లి గ్రామంలోని శ్రీ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. చౌడేపల్లి మండలం ఎ. కొత్తకోట గ్రామపంచాయతీ పరిధిలోని అంకుతోటపల్లి గ్రామంలో అభ్యర్థి శ్రీవిద్యతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు వినాయక స్వామిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు.

అనంతరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామస్థుల సమస్యలను కూడా తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ చౌడేపల్లి మండల నాయకులు, నాయకురాళ్లు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు పాల్గొన్నారు.