BREAKING
thumb ● మహమ్మదాపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● కదిరిలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం thumb ● మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎండీ రహీం షరీఫ్ thumb ● సొంత గ్రామంలో 26 లక్షలతో రహదారి నిర్మాణం thumb ● నారాయణపురంలో తాగునీటి పనులకు రూ.10 లక్షల నిధులు thumb ● వినాయకుడి పూజలతో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ప్రారంభం thumb ● సంస్థాన్ నారాయణపూర్‌లో నాటు కోళ్లకు విషప్రయోగం? thumb ● వైట్ ప్లేట్ వాహనాలతో ప్రయాణికుల తరలింపుపై టాక్సీ అసోసియేషన్ ఆందోళన thumb ● పైపులైన్‌ మరమ్మతులతో 131 ఆవాసాలకు తాగునీటి సరఫరా నిలిపివేత thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహమ్మదాపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● కదిరిలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం thumb ● మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎండీ రహీం షరీఫ్ thumb ● సొంత గ్రామంలో 26 లక్షలతో రహదారి నిర్మాణం thumb ● నారాయణపురంలో తాగునీటి పనులకు రూ.10 లక్షల నిధులు thumb ● వినాయకుడి పూజలతో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ప్రారంభం thumb ● సంస్థాన్ నారాయణపూర్‌లో నాటు కోళ్లకు విషప్రయోగం? thumb ● వైట్ ప్లేట్ వాహనాలతో ప్రయాణికుల తరలింపుపై టాక్సీ అసోసియేషన్ ఆందోళన thumb ● పైపులైన్‌ మరమ్మతులతో 131 ఆవాసాలకు తాగునీటి సరఫరా నిలిపివేత thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
మంచి మాట
Date of Publish : 28 October 2026, 03:44 pm
Posted by : కొత్తపల్లి వినోద్ కుమార్

కదిరిలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
కొత్తపల్లి వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ప్రతినిధి
28 Oct, 2026 - 03:44 PM
53 వీక్షణలు
  • 3, 4వ వార్డుల్లో ఇంటింటా పర్యటించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
  • కూటమి అభ్యర్థులకు మద్దతివ్వాలని విజ్ఞప్తి

కదిరి | ఎన్ టుడే న్యూస్‌: కదిరి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పట్టణంలోని 3, 4వ వార్డుల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు స్థానికులు ఆత్మీయ స్వాగతం పలికారు. పలుచోట్ల హారతులు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కదిరి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. కదిరి పట్టణంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.

నవంబర్ 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి షేక్ అర్షియా భానుతో పాటు 3వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పోలినేని సుజాతమ్మ, 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొలిమి అమ్మజాన్‌లను గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు.

కదిరి పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతామని కూటమి నాయకులు తెలిపారు. ప్రచారంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.