నారాయణపురంలో తాగునీటి పనులకు రూ.10 లక్షల నిధులు
నారాయణపురం, యాదాద్రి | ఎన్ టుడే న్యూస్: భవిష్యత్తులో ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని నారాయణపురం మండల కేంద్రంలో నీటి సరఫరా పనులకు రూ.10 లక్షల నిధులు మంజూరయ్యాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చొరవతో కలెక్టర్ జనరల్ ఫండ్ నుంచి ఈ నిధులు మంజూరైనట్లు స్థానికులు తెలిపారు.
ఈ నిధులతో బయోడీజిల్ నుంచి మోడల్ స్కూల్ మీదుగా పెద్దమ్మ బోర్డు వాటర్ ట్యాంక్ వరకు చేపట్టనున్న పనులకు గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి, లింగస్వామి శంకుస్థాపన చేశారు.
వేసవిలో తాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికతో పనులు చేపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి గ్రామ ప్రజలకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ, జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్త ఉమా ప్రేమ్‌చందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ కోన్‌రెడ్డి నరసింహ, జిల్లా నాయకులు మందుగుల బాలకృష్ణ, వార్డు సభ్యులు బల్గూరి శివ, సూరపల్లి వెంకటేష్, పట్నం బాలకృష్ణ, సభావత్ రఘునాయక్, నీళ్ల అనిత శంకర్, చింతల శైలజ సత్యనారాయణ, సింగపంగా ప్రశాంతి రమేష్, మహమ్మద్ అలీమా యూసఫ్ ఖాన్, పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్, పీఏసీఎస్ డైరెక్టర్ ఉప్పల కృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షుడు బద్దుల మురళి, గుత్త శేఖర్‌రెడ్డి, క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ ఉప్పల వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు అందే యాదయ్య, జక్కల యాదయ్య, ఉప్పరగొని యాదయ్య, భూపని బలరాం, చిలువేరు అంజయ్య, యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, కరోబార్ పున్నం యాదగిరి, మారగోని శంకర్, బానోతు కిరణ్, సికీల మెట్ల సాయి, వడ్డేపల్లి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.