BREAKING
thumb ● కాసులు కురిపించే కార్తీకమాసం నవంబర్ 09 నుంచి ప్రారంభం... thumb ● రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నవీన్ కుటుంబానికి రూ.1.50 లక్షల ఆర్థిక సాయం thumb ● గంగారంలో ఘనంగా కొమరం భీం 86వ వర్ధంతి thumb ● ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు thumb ● మహమ్మదాపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● కదిరిలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం thumb ● మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎండీ రహీం షరీఫ్ thumb ● సొంత గ్రామంలో 26 లక్షలతో రహదారి నిర్మాణం thumb ● నారాయణపురంలో తాగునీటి పనులకు రూ.10 లక్షల నిధులు thumb ● వినాయకుడి పూజలతో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ప్రారంభం thumb ● కాసులు కురిపించే కార్తీకమాసం నవంబర్ 09 నుంచి ప్రారంభం... thumb ● రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నవీన్ కుటుంబానికి రూ.1.50 లక్షల ఆర్థిక సాయం thumb ● గంగారంలో ఘనంగా కొమరం భీం 86వ వర్ధంతి thumb ● ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు thumb ● మహమ్మదాపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● కదిరిలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం thumb ● మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎండీ రహీం షరీఫ్ thumb ● సొంత గ్రామంలో 26 లక్షలతో రహదారి నిర్మాణం thumb ● నారాయణపురంలో తాగునీటి పనులకు రూ.10 లక్షల నిధులు thumb ● వినాయకుడి పూజలతో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ప్రారంభం
మంచి మాట
Date of Publish : 28 October 2026, 04:51 pm
Posted by : KOLA MAHESH

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
28 Oct, 2026 - 04:51 PM
14 వీక్షణలు
  • నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: డాక్టర్ బి. రవి రాథోడ్
  • అనుమతులు లేకుండా వైద్య చికిత్సలు చేయొద్దు

మహబూబాబాద్, అక్టోబర్ 28 | ఎన్ టుడే న్యూస్‌: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ వైద్య సిబ్బందికి సూచించారు. బుధవారం ఆయన వైద్య బృందంతో కలిసి బయ్యారం, గంధంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది హాజరు పట్టికలు, మందుల నిల్వలు, వైద్య రికార్డులు, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. రోగులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.

అర్హతలు, అనుమతులు లేకుండా ఇంజక్షన్లు వేయడం, సెలైన్లు ఎక్కించడం, సూదుల ద్వారా వైద్య చికిత్సలు అందించడం వంటి చర్యలకు పాల్పడరాదని డీఎంహెచ్‌ఓ హెచ్చరించారు. ప్రథమ చికిత్స కేంద్రాలు తమకు అనుమతించిన పరిధిలోని సేవలకే పరిమితం కావాలని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి వైద్య సేవలు అందించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ తనిఖీల్లో గంధంపల్లి వైద్యాధికారి డాక్టర్ ఉస్మాన్, సీహెచ్‌ఓ జ్ఞాన సుందరి, డిప్యూటీ డీఎంఈఓ రాజకుమార్, డీపీఓ నీలోహన తదితరులు పాల్గొన్నారు.