రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నవీన్ కుటుంబానికి రూ.1.50 లక్షల ఆర్థిక సాయం
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
నారాయణపూర్
మల్లారెడ్డిగూడెం, యాదాద్రి భువనగిరి జిల్లా | ఎన్ టుడే న్యూస్: సంస్థాన్ నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కొండూరి నవీన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్ అన్నం మల్లేష్ పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా నిలిచేందుకు, పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించే ఉద్దేశంతో ఆర్థిక సాయం అందించారు.
చలమల్ల కృష్ణారెడ్డి రూ.లక్ష, సర్పంచ్ అన్నం మల్లేష్ రూ.50 వేల చొప్పున చెక్కుల రూపంలో అందజేశారు. మొత్తం రూ.1.50 లక్షల ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబానికి అందించి, ఈ కష్టకాలంలో వారికి అండగా ఉంటామని తెలిపారు.