BREAKING
thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి
Date of Publish : 11 October 2026, 08:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నేల ఆరోగ్యంతోనే నాణ్యమైన పంట దిగుబడి మోరంపూడి శ్రీనివాసరావు,యర్రా ప్రసాద్ రావు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Oct, 2026 - 08:04 PM
29 వీక్షణలు

జింక్, బోరాన్, వేప పిండి వినియోగంపై రైతులకు అవగాహన.. వ్యవసాయ పనిముట్లపై 50 శాతం సబ్సిడీ ప్రకటించిన గ్రీన్ గ్రో ఆర్గానిక్

నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, పంటలకు అవసరమైన పోషకాలను సరైన మోతాదులో అందించినప్పుడే నాణ్యమైన దిగుబడులు సాధ్యమవుతాయని పోలవరం పిఏసియస్ ఛైర్పర్సన్ యర్రా ప్రసాద్ రావు చనుబండ పిఏసియస్ ఛైర్పర్సన్  మోరంపూడి శ్రీనివాసరావు సూచించారు. నేలలో సూక్ష్మపోషకాల లోపాలను గుర్తించడం, సేంద్రియ పదార్థాల వినియోగాన్ని పెంచడం, శాస్త్రీయ సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా రైతులు ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు పంటల నాణ్యతను మెరుగుపరచుకోవచ్చని పేర్కొన్నారు.

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో పీఏసీఎస్‌ చైర్మన్ యర్రా ప్రసాదరావు ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రీన్ గ్రో ఆర్గానిక్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రీన్ గ్రో ఆర్గానిక్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణయ్య మాట్లాడుతూ జింక్, బోరాన్, వేప పిండి వినియోగం, వాటి ప్రయోజనాలు, నేల ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు మాట్లాడుతూ పంటల ఎదుగుదలకు ప్రధాన పోషకాలతోపాటు జింక్, బోరాన్ వంటి సూక్ష్మపోషకాలు కూడా అవసరమని,నేలలో వీటి లోపం ఏర్పడితే మొక్కల పెరుగుదల మందగించడం, ఆకుల రంగులో మార్పులు రావడం, పూత, కాయల అభివృద్ధిపై ప్రభావం పడటం వంటి సమస్యలు తలెత్తవచ్చని తెలిపారు.

మాజీ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు) మాట్లాడుతూ జింక్ మొక్కలలో వివిధ జీవక్రియలు సక్రమంగా సాగేందుకు, ఎదుగుదలకు తోడ్పడుతుందని, వరి, మొక్కజొన్న తదితర పంటల్లో జింక్ లోపాన్ని గుర్తించి, వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు తగిన మోతాదులో జింక్ సల్ఫేట్ వినియోగించడం ద్వారా పంట ఎదుగుదలకు సహాయపడవచ్చని. అదే విధంగా బోరాన్ పుష్పించడం, పరాగసంపర్కం, కాయలు, పండ్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అయితే ఈ సూక్ష్మపోషకాలను అవసరానికి మించి వినియోగిస్తే పంటలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని సూచించారు.

టీడీపీ సీనియర్ నేత మందపాటి బసవా రెడ్డి మాట్లాడుతూ వేప పిండితో నేల ఆరోగ్య పరిరక్షణ జరుగుతుందని సేంద్రియ పదార్థాల వినియోగం నేల భౌతిక, జీవ లక్షణాలను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని వివరించారు. వేప పిండిలోని సేంద్రియ పదార్థాలు నేల నాణ్యతను మెరుగుపరచడంతోపాటు, కొన్ని రకాల నేలలో నివసించే హానికర జీవుల ప్రభావాన్ని తగ్గించే సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో తోడ్పడతాయని తెలిపారు.

తుమ్మగూడెం పిఏసియస్ సిఈవో మాదాసు చిన్న పుల్లయ్య మాట్లాడుతూ రైతులు నేల స్వభావం, పంట రకం, పోషకాల స్థాయిని పరిగణనలోకి తీసుకుని ఎరువులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. నేల పరీక్షలు చేయించడం ద్వారా ఏ పోషకం ఎంత మోతాదులో అవసరమో తెలుసుకోవచ్చని, దీనివల్ల అనవసర ఎరువుల వినియోగాన్ని తగ్గించి సాగు ఖర్చులను నియంత్రించవచ్చని పేర్కొన్నారు.

వ్యవసాయ పనిముట్లపై 50 శాతం సబ్సిడీ

రైతులకు వ్యవసాయ పనిముట్లను 50 శాతం సబ్సిడీతో అందించనున్నట్లు గ్రీన్ గ్రో ఆర్గానిక్ సంస్థ ప్రకటించింది. వ్యవసాయ పనులకు అవసరమైన పరికరాలను తక్కువ ఖర్చుతో సమకూర్చుకునేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే సబ్సిడీకి వర్తించే పరికరాలు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన వివరాలను సంస్థ నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఈ కార్యక్రమంలో టీడీపీ నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, మాజీ ఎంపీపీ కందుల కృష్ణ మాట్లాడుతూ నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, పంటలకు అవసరమైన పోషకాలను సమతుల్యంగా అందించడం, శాస్త్రీయ సాగు పద్ధతులను పాటించడం ద్వారా రైతులు నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని  వివరించారు. ఈ కార్యక్రమంలో  తమ్మిలేరు రిజర్వాయర్ నీటి సంఘం అధ్యక్షులు యర్రా రమేష్, జనసేన నేత సవరం రామారావు పోలవరం టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు బిలుగుది జయరాజు, రాజా, పానుగళ్ళ కోటేశ్వరరావు, శేఖర్ ముసునూరు పీఏసీఎస్‌ ఛైర్పర్సన్ శ్రీధర్ రైతులు పాల్గొన్నారు సందర్భంగా నాయకులను శాలువాలు, పుష్ప గుచ్చాలతో ఘనంగా సత్కరించారు