నరసాపురం పాఠశాలలో బోధన తీరుపై ఆరా తీసిన ఎమ్మెల్యే కొలికపూడి
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు ఏ విధంగా బోధిస్తున్నారు, తరగతుల్లో బోధన తీరు ఎలా ఉందనే విషయాలను ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు మేరుగు రమేష్ తన క్రీడా ప్రగతికి సంబంధించిన ట్రాక్ రికార్డును ఎమ్మెల్యేకు చూపించారు. రమేష్ సాధించిన ప్రగతిని పరిశీలించిన కొలికపూడి శ్రీనివాసరావు ఆయనను అభినందిస్తూ ‘శభాష్ రమేష్’ అంటూ ప్రశంసించారు.