చిన్న కాపర్తిలో నూతన గ్రంథాలయం ప్రారంభం
NTODAY NEWS : చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని గ్రంథాలయ చైర్మన్ కొండ శేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలని అన్నారు. విద్యార్థులు, యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు, పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించుకునేందుకు గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ మాట్లాడుతూ గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు కావడం సంతోషకరమైన విషయమని అన్నారు. విద్యార్థులు, యువతతో పాటు గ్రామ ప్రజలందరూ పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని కోరారు. గ్రంథాలయాన్ని వినియోగించుకుంటూ విద్యా, విజ్ఞాన రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. గ్రామంలో విద్యాభివృద్ధికి, యువతకు అవసరమైన సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో నూతన గ్రంథాలయం అందుబాటులోకి రావడం పట్ల స్థానికులు, యువత హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆవుల రమేష్, విపంచి ఫౌండేషన్ చైర్మన్ ఏ. శ్రీనివాస్, PACS చైర్మన్ రఘు రెడ్డి, రుద్రరపు లక్ష్మణ్, రొండి నరసింహ, దేశపాక మధు, పల్లపు ప్రశాంత్, సత్యనారాయణ, బెల్లంకొండ రఘు, దాసరి సైదులు, ఆకుల వెంకన్న, రొండి వెంకన్న, శిరస్సు హనుమయ్య, మామిడి స్వామి, సుధాకర్, రాజు, బిక్షపతి, ఈశ్వరయ్య, ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.