వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు
నారాయణపురం: మండలంలోని వావిళ్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా గుండెపంగా చిన్నస్వామి ఎన్నికయ్యారు.
పార్టీ మండల శాఖ ఆదేశాల మేరకు నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ సర్పంచ్ ఐతరాజు సరళ చంద్రయ్య, మాజీ సర్పంచ్ వంగూరి సత్తయ్య ఆధ్వర్యంలో చిన్నస్వామిని గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా ఎంపాల మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా జక్కర్తి పరమేష్, కార్యదర్శిగా గుండెపంగా యాదయ్య, కోశాధికారిగా వల్లపోజు గణేష్ చారి ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చిన్నస్వామి మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలపై స్పందించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. పార్టీ నాయకత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నికతో గ్రామ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు కోల మహేష్, మండల మీడియా కన్వీనర్ శ్రీరాముల రవి, వార్డు సభ్యులు బొమ్మరగొని లక్ష్మయ్య, వంగూరి శ్రీను, జక్కర్తి సత్తయ్య, పెద్దగోని స్వామి, చింతకాయల జంగయ్యతో పాటు పార్టీ కార్యకర్తలు నూతన అధ్యక్షుడు చిన్నస్వామిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.