BREAKING
thumb ● పేగ పంచాయతీలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్ thumb ● నవంబర్ 15న నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి thumb ● జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీడీవో thumb ● రంగాపూర్‌లో వివో భవన నిర్మాణ పనుల పరిశీలన thumb ● ఈనెల 7న వలిగొండకు తీన్మార్ మల్లన్న పాదయాత్ర.. విజయవంతం చేయాలి thumb ● ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన నర్సంపేట ఏసీపీ, దుగ్గొండి సీఐ thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు ఐక్యంగా ఉద్యమిద్దాం thumb ● ముల్కనూర్ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఎక్సెల్ బండిని ఢీకొన్న కారు thumb ● పేగ పంచాయతీలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్ thumb ● నవంబర్ 15న నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి thumb ● జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీడీవో thumb ● రంగాపూర్‌లో వివో భవన నిర్మాణ పనుల పరిశీలన thumb ● ఈనెల 7న వలిగొండకు తీన్మార్ మల్లన్న పాదయాత్ర.. విజయవంతం చేయాలి thumb ● ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన నర్సంపేట ఏసీపీ, దుగ్గొండి సీఐ thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు ఐక్యంగా ఉద్యమిద్దాం thumb ● ముల్కనూర్ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఎక్సెల్ బండిని ఢీకొన్న కారు
Test 4
Date of Publish : 05 November 2026, 08:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్లాస్టిక్ వద్దు.. జూట్ ముద్దు చండ్రుపట్లలో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Nov, 2026 - 08:27 PM
18 వీక్షణలు

విస్సన్నపేట, నవంబర్ 5: పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనశైలి ప్రాముఖ్యతను ప్రజలకు వివరించే లక్ష్యంతో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు–2026లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం చండ్రుపట్ల గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఒక వారం.. ఏడు ఆచరణలు.. ఒక భవిష్యత్తు అనే నినాదంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించడంపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా జూట్, వస్త్ర సంచులను వినియోగించాలని, ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి, నీరు, గాలి కాలుష్యానికి కారణమవుతున్నాయని, వన్యప్రాణుల మనుగడకు ముప్పుగా మారడంతో పాటు ఆహార గొలుసును కూడా కలుషితం చేస్తున్నాయని వివరించారు. భారతదేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు వ్యక్తిగత స్థాయిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ప్రభుత్వాలు కూడా ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, వ్యర్థాల సేకరణ, పునర్వినియోగం, ప్రజల్లో అవగాహన పెంపునకు మరిన్ని చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు అంతర్జాతీయ ఒప్పందం దిశగా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. దాదాపు 200 దేశాలు ప్లాస్టిక్ వ్యర్థాల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించే దిశగా చర్చలు జరుపుతున్నాయని వివరించారు. ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణకు ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని, ఓజోన్ పొర పరిరక్షణ కోసం అమలైన మాంట్రియల్ ప్రోటోకాల్ తరహాలో ప్లాస్టిక్ కాలుష్య నివారణకు కూడా సమర్థవంతమైన అంతర్జాతీయ కార్యాచరణ అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వద్దు.. జూట్ ముద్దు అనే నినాదంతో ప్రకృతిని కాపాడుకుందామని, భావితరాలకు పచ్చని భూమిని అందించేందుకు వస్త్ర, జూట్ సంచుల వినియోగాన్ని అలవాటు చేసుకుందామని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది యూనిట్ ఇన్‌చార్జి జి. శ్రీనివాసరావు, ఐసీఆర్‌పీ వి. విజయలక్ష్మి, రైతులు తదితరులు పాల్గొన్నారు.