పోలింగ్ ముగిసినా కొనసాగిన ఓటర్ల క్యూ.. ఓటు హక్కు వినియోగానికి అవకాశం
వీరులపాడులో సాయంత్రం 5 గంటల తర్వాత కూడా బారులు తీరిన ఓటర్లు.. ఓపికతో సహకరించిన అధికారులు, పోలీసులు
వీరులపాడు, నవంబర్ 5 (ఎన్ టుడే న్యూస్): ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండల కేంద్రంలోని వీరులపాడు గ్రామంలో గురువారం నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే, పోలింగ్ సమయం ముగిసినప్పటికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా క్యూ లైన్లలో వేచి ఉన్నారు.
క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం
సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించేందుకు అధికారులు, పోలీసులు, పోలింగ్ సిబ్బంది సహకరించారు. పోలింగ్ బూత్ ఏజెంట్లు సైతం ఓపికతో వ్యవహరిస్తూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించారు.
పోలింగ్ సమయం ముగిసినప్పటికీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే వరకు అధికారులు సమన్వయంతో వ్యవహరించడం విశేషం.