జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఎరుపల్లెలో పెట్రోల్ బాంబుల కలకలం
ఆంధ్రప్రదేశ్
/
వైఎస్ఆర్ కడప
పులివెందుల మండలంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. పెట్రోల్ బాంబులు విసిరినట్లు సమాచారం
పులివెందుల (ఎన్ టుడే న్యూస్): పులివెందుల మండలం ఎరుపల్లె గ్రామంలో జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి, పెట్రోల్ బాంబులు విసిరినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే ఘర్షణకు దారితీసిన కారణాలు, పెట్రోల్ బాంబుల దాడిలో ఎవరైనా గాయపడ్డారా, ఆస్తి నష్టం జరిగిందా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.